ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌ కథనంతో కలకలం

WATCH ABN VIDEO: 'ND TIWARI'S SEX SCANDAL'
    * రాష్ట్ర గవర్నర్‌ తివారీపై లైంగిక వేధింపుల ఆరోపణలు

    హైదరాబాద్‌  : రాష్ట్ర గవర్నర్‌ నారాయణ్‌ దత్‌ తివారీపై వెలుగుచూసిన 'లైంగిక వేదింపుల' ఆరోపణలు రాష్ట్ర ప్రజానీకాన్ని నివ్వెరపర్చాయి. రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. 'రాజ్‌భవన్‌లో రాసలీలలు' పేరుతో రాష్ట్రానికి చెందిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతి  టీవీ ఛానల్‌ ప్రసారం చేసిన ఈ కథనం సంచలనం సృష్టించింది. అనైతిక శృంగార కార్యకలాపాల్లో తివారీ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా ఈ కథనంలోని దృశ్యాలున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చిన యువతులను రాజ్‌భవన్‌లో పనివారిగా నియమించి వారిని గవర్నర్‌ అనైతిక కార్యకలాపాలకు వినియోగించినట్లు ఆ ఛానెల్‌ వెల్లడించింది. 85 ఏళ్ల తివారీ 17-25 ఏళ్ల మధ్య వయస్సున్న యువతులతో 'మసాజ్‌' పేరిట ప్రకృతి విరుద్ధమైన శృంగార కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. గవర్నర్‌ ప్రత్యేకాధికారి (ఓఎస్‌డి) అరవింద్‌ శర్మకు కూడా ఈ కార్యకలాపాల్లో ప్రమేయం వున్నట్లు వెల్లడించారు. శర్మకు సన్నిహితురాలైన రాధిక అనే కాంట్రాక్టర్‌ ఈ వ్యభిచార కుంభకోణం (సెక్స్‌ స్కాండల్‌) వివరాలను వెల్లడించినట్లుగా కథనంలో పేర్కొన్నారు. ఇక్కడ కూడా 'గనులే' ప్రధాన పాత్ర వహించటం విశేషం. కడప జిల్లాలో గనుల లీజు కోసం ప్రయత్నించిన రాధిక గవర్నర్‌ ఓఎస్‌డి సహాయాన్ని కోరింది. అయితే ఆమెకు ఈ కాంట్రాక్ట్‌ దక్కలేదు. దీంతో రాజ్‌భవన్‌లో జరుగుతున్న వ్యవహారాలను ఆమె బయటపెట్టినట్లుగా కథనంలో పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ తనకు అతిధిగృహంలా ఉపయోగపడేదని, తాను హైదరాబాద్‌లో వచ్చినపుడల్లా రాజ్‌భవన్‌లోనే బస చేసే దాన్నని ఆమె వివరించింది. రాజ్‌భవన్‌లోని పై అంతస్తులో యువతులతో శృంగారంలో మునిగి తేలుతున్న సమయంలో ఎవరైనా ప్రముఖులు కానీ అధికారులు కానీ వచ్చినపుడు తివారీ కిందకు దిగి వచ్చేవారని, వారు వెళ్లిపోయిన వెంటనే తిరిగి పైకి వెళ్లి యవతులతో గడిపేవారని ఆమె ఆ ఛానెల్‌ కథనంలో వివరించింది. ఈ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను ఆమె ఛానల్‌కు అందచేసింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాంచల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో కూడా యువతులతో తివారీ అక్రమ సంబంధాలు కొనసాగించే వారని ఆమె ఆరోపించింది. గవర్నర్‌తో శృంగార కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు వాటిని వీడియో తీసి యువతులను అధికారులు బ్లాక్‌మెయిల్‌ చేసే వారని, పాలక పక్షానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా వీరిని శృంగార కార్యకలాపాలకు వినియోగించుకున్నారని ఆమె ఆరోపించారు. రాజ్‌భవన్‌ వ్యభిచార గృహంలా మారిందని రాధిక ఛానెల్‌ కథనంలో విమర్శించింది.

నిలిపివేతకు హైకోర్టు ఆదేశాలు

    కాగా ఈ ప్రసారాలు ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసు అధికారులు హైకోర్టు నుండి 'ఇంజెక్షన్‌ ఆర్డర్‌' తీసుకొచ్చి వాటిని నిలిపేయించారు. మరోవైపు గవర్నర్‌ తీరుపై మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తివారీ గత చరిత్రను పరిశీలిస్తే ఈ ఆరోపణలు కొంతమేరకు వాస్తవం అయ్యే అవకాశాల్లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తివారీ గత చరిత్ర

    గతంలో వెలుగు చూసిన తివారీ వివాహేతర సంబంధాల కేసు కూడా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తనను సహజ కుమారుడిగా ఆమోదించాలని తివారీని డిమాండ్‌ చేస్తూ ఉజ్వల కుమారుడు రోహిత్‌ తివారీపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు తివారీకి సమన్లు జారీ చేసింది. రోహిత్‌ శేఖర్‌ తన వాదనను సమర్ధించుకునేందుకు తివారీని ఎన్‌డిఎ పరీక్షకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. అయితే ఇందుకు తివారీ గట్టిగా తిరస్కరించారు. ఒక మహిళ తన భర్తతో కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ వివాహేతర సంబంధాలకు పాల్పడి సంతానానికి జన్మనిచ్చినప్పటికీ వారిని ఆ భర్త సంతానంగానే పరిగణించాలని చట్టం నిర్దేశిస్తోంది. చట్టంలోని ఈ నిబంధన ఆధారంగా ఈ కేసునుండి తప్పుకునేందుకు తివారీ విశ్వప్రయత్నం చేశారు. తన భర్త తనను విడిచి వెళ్లిన సమయంలోనే తాను తివారీతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించానంటూ ఉజ్వల మరోపిటిషన్‌లో హైకోర్టుకు తెలియచేసింది. తమ ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం తీవ్రస్థాయిలో వున్నప్పటికీ తన వివాహం వివాదంలో పడిన సమయంలో తనను ముగ్గులోకి దింపి వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడని ఆమె తెలిపింది. తన భార్య శారీరకలోపంతో సంతానార్హురాలుకాదని తనతో చెప్పేవాడని, పిల్లలు కావాలని తివారీ పట్టుపట్టేవాడని ఆమె తెలిపింది. 1993లో తన భార్య మరణానంతనం రోహిత్‌ను తన కుమారుడిగా బహిరంగంగా అంగీకరిస్తానంటూ తివారీ మరోసారి తనకు దగ్గరయ్యాడని, 1995లో ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసినపుడు తనతో మాట్లాడేందుకే తిరస్కరించాడని ఉజ్వల వెల్లడించారు.
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌ కథనంతో కలకలం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌ కథనంతో కలకలం Reviewed by AndhraDarshini on 00:38 Rating: 5

No comments:

Facebook