మదర్‌ థెరెస్సాపై అమెరికా స్టాంప్‌

నోబెల్‌ శాంతి బహుమతి విజేత, భారత్‌కు చెందిన మదర్‌ థెరెస్సా శతజయంతి సందర్భంగా ఆమె గౌరవార్ధం అమెరికా ప్రభుత్వ పోస్టల్‌ విభాగం ప్రత్యేక స్టాంపును విడుదల చేయనుంది. ఈ స్టాంపును విడుదల చేయటం ద్వారా అమెరికా పోస్టల్‌ విభాగం మదర్‌ సేవలను గుర్తించినట్లయిందని ఒక అధికార ప్రకటనలో పేర్కొన్నారు. 2010లో విడుదల చేయనున్న కొత్త స్టాంపుల జాబితాలో మదర్‌ పేరును చేర్చనున్నట్లు ఆ ప్రకటనలో వివరించారు. వాస్తవానికి ఈ స్టాంపు విడుదల 1996లో మదర్‌ శతజయంతి సందర్భంగానే జరగాల్సి వున్నప్పటికీ నాటి అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ నాడు ఆమెకు గౌరవ పౌరసత్వాన్ని ప్రకటించారు.
మదర్‌ థెరెస్సాపై అమెరికా స్టాంప్‌ మదర్‌ థెరెస్సాపై అమెరికా స్టాంప్‌ Reviewed by AndhraDarshini on 11:37 Rating: 5

No comments:

Facebook