కార్మికుల జీవన పోరాటాలే.."సిటీ ఆఫ్‌ గోల్డ్‌"

అస్తిత్వ, వాస్తవ్‌ చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన నటుడు, దర్శకుడు..మహేష్‌ మంజ్రేకర్‌. నటుడిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ... డైరెక్షన్‌వైపు మరోసారి తొంగిచూస్తున్నాడు. అదీ.. నాలుగు సంవత్సరాల తర్వాత. 'సిటీ ఆఫ్‌ గోల్డ్‌' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ముంబాయిలోని ఓ మిల్లు కార్మికుల నిజ జీవిత గాధలే ఈ చిత్రంలోని ప్రధానాంశం. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ మిల్లులోని కార్మికులు పనిచేస్తుంటారు. కనీస వసుతుల కోసం వారు తమ జీవన పోరాటం మొదలెడతారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా వారి పోరాటం కదులుతుంది. అత్యంత గోప్యంగా, సామాన్యంగా మొదలవుతుంది. 'సిటీ ఆఫ్‌ గోల్డ్‌' కథ ఇది.
'ముంబై నగరంలో అనేక మిల్లులు, పరిశ్రమలు ఉండేవి. అందులో లక్షల మంది కార్మికులు పనిచేసేవారు. ఆవన్నీ..నేడు రియల్‌ఎస్టేట్‌ వ్యాపార కేంద్రాలుగా మారాయి. పెద్ద పెద్ద రెసిడెన్షియల్‌ బిల్డింగ్స్‌, మాల్స్‌, మల్టీఫ్లెక్స్‌లు..ఇలా అనేకం నేడు కొలువైనాయి. దాదాపు 28 సంవత్సరాలుగా ఈ మార్పులు జరుగుతున్నాయి. కానీ అక్కడుండే మిల్లులోని కార్మికుల జీవనాలను మరిచిపోయాం. వారేమయ్యారో తెలియదు. దీని గురించి చాలా సంవత్సరాలుగా నేను ఆలోచిస్తున్నాను. దీన్ని ఒక కథాంశంగా ఈ సినిమా తీయబోతున్నా' అని తెలుపుతున్నారు మహేష్‌ మంజ్రేకర్‌.
తెలుపు, ఆకుపచ్చ, నీలం...అనే రంగులను ఆధారంగా చేసుకుని మహేష్‌ మంజ్రేకర్‌ మరో వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ కూడా రాస్తున్నారు. ఒక్కొక్కరంగు ఒక థమ్‌ను వివరిస్తుంది. తెలుపు రంగును ఓ మహిళ ద్వారా నిర్వచిస్తారు. స్వచ్ఛత, ఆహ్లాదం, మరణం, శాంతి..వంటి వాటిని ఈ మహిళ ద్వారా చూపుతారు. ఇలా..మిగతా రంగుల ప్రస్తావనా ఉంటుంది. ఈ కథనంతో సినిమా తీయడానికి ఏ నిర్మాతా మందుకు రాకపోవడంతో మంజ్రేకర్‌ తన స్వంత ప్రొడక్షన్‌లో నిర్మించబోతున్నారు.
కార్మికుల జీవన పోరాటాలే.."సిటీ ఆఫ్‌ గోల్డ్‌" కార్మికుల జీవన పోరాటాలే.."సిటీ ఆఫ్‌ గోల్డ్‌" Reviewed by AndhraDarshini on 04:39 Rating: 5

No comments:

Facebook