శాంతి, సహనం ఇదే ఏసుక్రీస్తు సందేశం

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,
ప్రధాని క్రిస్మస్‌ శుభాకాంక్షలు  

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దేశ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, ఐక్యమత్యం, సామరస్యం పెంపొందించడానికి ఏసుక్రీస్తు సందేశం తోడ్పడుతుందని రాష్ట్రపతి ఓ ప్రకటనలో తెలిపారు. కరుణ, సహనం, సోదరభావం, ప్రేమ, త్యాగాన్ని క్రీస్తు ప్రజలకు అందించారని ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రేమ, శాంతికి గుర్తుగా క్రిస్మస్‌ను జరుపుకుంటామని ప్రధాని మన్మోహన్‌ చెప్పారు. ప్రజలంతా ఉత్సాహంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
శాంతి, సహనం ఇదే ఏసుక్రీస్తు సందేశం శాంతి, సహనం ఇదే ఏసుక్రీస్తు సందేశం Reviewed by AndhraDarshini on 01:30 Rating: 5

No comments:

Facebook