విఠలాచార్య సినిమాల్లోని వింతవింతలోకాలు మనకు తెలుసు. టెక్నాలజీ అంతగాలేని రోజుల్లోనే పుష్పక విమానాలు, ఎగిరే జంతువులు మనం చూశాం. కానీ మారిన టెక్నాలజీపరంగా వాటిని చూస్తే ఎలా ఉంటుందో తెలియజేసే కదిలేబొమ్మే 'అవతార్'. ఆంగ్లసినిమాలకు పేరుగాంచిన ట్వంటియత్ సెంచురీ ఫ్యాక్స్ సంస్థ ఈ చిత్రాన్ని 2400 కోట్లతో నిర్మించింది. టెర్మినేటర్, టైటానిక్ చిత్రాల సృష్టికర్త జేమ్స్ కామెరాన్ నాలుగేళ్ళ కలలస్వప్నం. పురాణేతిహాసాల ప్రభావంతో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ ఇది. 2012 అనేది మానవాళిని నాశంచేస్తే, ఆ తర్వాత మరో 142 సంవత్సరాలకు అంటే 2154నాడు ఇలా ఉంటుందనే చెప్పే ఊహాచిత్రం.
కథ: స్పేస్‌లో వేరే గ్రహానికి వెళ్ళిన సైన్యదళంతో కథ ప్రారంభమవుతుంది. స్సేస్‌కు చెందిన ఓ అధికారి జాక్ (శామ్ వర్దింగ్టన్) ప్రమాదవశాత్తూ నడుముభాగంలో స్పర్శను కోల్పోతాడు. పూర్వస్థితిరావాలంటే ఆపరేషన్ 'అవతార్'లో పాలుపంచుకోవాల్సివస్తుంది. దానికోసం పాండోరా అనే గ్రహానికి వెళ్ళాల్సివస్తుంది. అక్కడ తోక, బంగారువన్నెగల పెద్దని కనులు, నీలివర్ణంతో పొడవాటి ట్రైబల్ తెగ నివశిస్తుంది. వారంతా ప్రకృతిని ప్రేమిస్తారు. జంతువునైనా పాజిటివ్‌గా ఆలోచించి దాన్ని వశపర్చుకొనే తత్త్వం వారిది. అంటే ధర్మోరక్షితి రక్షిత: అనే పద్ధతి. ఎన్నో మహిమలుగల పవిత్రమైన చెట్టును ఆరాధిస్తుంటారు. అక్కడ అద్భుతమైన ఖనిజసంపద ఉంటుంది. ఆ సంపదను కైవసంచేసుకోవడానికి సైన్యం ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ మనిషి ఉండేందుకు సరిపడా ఆక్సిజన్ ఉండదు. అందుకే సైన్యం ఓ కొత్తప్రయోగంచేస్తుంది. అవతార్ తరహాలోనే మనిషిని ప్రవేశించి అక్కడ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. దానికి జాక్‌ను ఎంపికచేస్తుంది.
జాక్ సోదరుడుకూడా ఒకప్పుడు వారితో పోరాడి ప్రాణం కోల్పోతాడు. ఆయన దేహంలో జాక్‌ను ప్రవేశపెట్టి పాండోరాకు పంపిస్తారు. కానీ అక్కడ వారి దయార్ద్ర హృదయాన్ని, ప్రకృతిపట్ల వారికున్న ప్రేమకు కరిగిపోయి వారికి జాక్ సపోర్ట్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో ఆర్మీ వారి స్థావరంపై దాడిచేస్తుంది. దాంతో జాక్ వారినందరినీ ఒక్కతాటిపై తెచ్చి పోరాడి ఆర్మీని ఎలా వెనక్కు పంపించాడనేది కథ.
ముఖ్యంగా 3డి ఎఫెక్ట్స్ విజువల్స్, కలర్‌గ్రేడింగ్ ప్రేక్షకుడిని మరో అందమైన లోకంలోకి విహరింపజేస్తాయి. అక్కడి జంతువులతో కలిసిపోయి ఎలా మనుగడ సాగిస్తారనేది చక్కగా చూపారు. రాత్రి పూట చెట్లద్వారా వచ్చే వెలుగు పులకరింపజేస్తుంది.
శామ్ వర్దింగ్టన్, సిగోర్నీ వీవర్, జూయీ సల్దాన్ ప్రధాన పాత్రలతోపాటు ప్రతి వారూ జీవించారనే చెప్పాలి. అక్కడ ఉండే సెలయేర్లు, వేలాడే కొండలు, పొడవాటి చెట్లు, గుహలు, లోయలు, డైనోసార్‌లాంటి ఎగిరేపక్షలు చూసే ప్రేక్షకుడికి ధ్రిల్ కలిగిస్తాయి.
ముఖ్యంగా చిత్రానికి ప్రాణం గ్రాఫిక్ వర్క్. యాక్షన్ అంశాలకూ పెద్ద పీటవేశారు. చిత్ర నిడివి రెండున్నర గంటలు. బయటకువచ్చేవరకు అంత సమయం అయిందా అనిపిస్తుంది. ఇంటర్‌వెల్ పెడితే మధ్యలో 3డిలో చూసే ఫీల్ మిస్ అవుతారని ఆ అవకాశం కల్పించలేదని ఐమాక్స్ 3డి ప్రతినిధి రమేష్‌ప్రసాద్ చెప్పారు. ఈనెల 31వరకు టిక్కెట్లు అమ్ముడయ్యాయనీ, శుక్రవారంనాడే 3-డివి 15వేలు, 2డివి 10వేల టిక్కెట్లు అమ్ముడుకావడం విశేషమని పేర్కొన్నారు. 2012 చిత్రం తర్వాత అంతరేంజ్‌లో ఈ చిత్రానికి ఆదరణ లభించడం ఆనందంగా ఉందన్నారు.
నటీనటులు: శామ్ వర్ధింగ్టన్ (హార్ట్స్ వార్, రోగ్- ఫేమ్), సిగోర్నీ వీవర్ (ఎలియన్ ఫేమ్), జోయీ సల్దానా (ది టెర్నినల్).
టెక్నీషియన్స్: ఫుజున్ డిజిటల్ 3-డి కెమెరా: విన్స్ పేస్, కామెరాన్, విజువల్ ఎఫెక్ట్స్: వేటా విజువల్స్ (ది లార్డ్ ఆఫ్‌ది రింగ్స్ ట్రిలోగీ), నిర్మాణసంస్థ: 20ఫ్యాక్స్ సెంచురీ.

గ్రాఫిక్స్ మాయాజాలం అవతార్
Reviewed by AndhraDarshini
on
11:38
Rating:

No comments: