'విశ్వనాథ' చరిత్ర కాపాడుకుందాం

సామాన్య ప్రతిభ నింపుకొన్న తన సాహితీవిలాసాలతో తెలుగు భాషను సుసంపన్నం చేసిన తెలుగు జాతినిర్మాత 'కవిసమ్రాట్‌' విశ్వనాథ సత్యనారాయణ నివాసాన్ని చారిత్రక కట్టడంగా తీర్చిదిద్దడానికి ఆయన వారసులు ముందుకు వచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభల సందర్భంగా విశ్వనాథ నివాసంలో ఏర్పాటుచేసిన ఆయన జ్ఞాపికల
ప్రదర్శనను శనివారం ఉదయం మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్‌, హిందీ అకాడెమి అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ప్రారంభించారు. విశ్వనాథ చిత్రపటానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు. 

అనంతరం ఆయన విశ్వనాథ వారసులతో మాట్లాడుతూ కవిసమ్రాట్‌ నివాసాన్ని చారిత్రక కట్టడం తీర్చిదిద్దడానికి 'తానా' ముందుకు వచ్చిందని, వారసుల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇందుకు విశ్వనాథ మనుమడు విశ్వనాథ సత్యనారాయణ స్పందిస్తూ ఈ విషయంలో తనకు ఏవిధమైన అభ్యంతరం లేదన్నారు. తమ పితామహుల జ్ఞాపకాలన్నింటినీ అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పులూరి మల్లికార్జునశర్మ కొలనుకొండ శివాజీ, రాళ్లబండి కవితాప్రసాద్‌, డాక్టర్‌ పాలపర్తి శ్యామలాంనంద ప్రసాద్‌, విశ్వనాథ వారసులు శక్తిధర్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ చక్కని భావావేశంతో విశ్వనాథ రచించిన పద్యాలను గానం చేశారు.
'విశ్వనాథ' చరిత్ర కాపాడుకుందాం 'విశ్వనాథ' చరిత్ర కాపాడుకుందాం Reviewed by AndhraDarshini on 11:46 Rating: 5

No comments:

Facebook