ఒక్క రాత్రిలోనే 266 బస్సుల ధ్వంసం

ఇప్పటి వరకు నష్టం రూ.110 కోట్లపైనే 

రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనలతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోంది. ఈ నెల 22 వరకు 346 బస్సులను ధ్వంసం చేయగా 14 బస్సులను దహనం చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు తెలంగాణ జిల్లాల్లో మొత్తం 266 బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఏడు బస్సులను దహనం చేశారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి నుంచి సాగిన బస్సుల విధ్వంసం, దహనం వల్ల మొత్తం ఆర్టీసీకి రూ.1.85 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఇప్పటివరకు రూ.4.74 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. గత నెల నుంచి పూర్తిస్థాయిలో బస్సులు తిరగకపోవడం వల్ల టిక్కెట్ల ద్వారా రాబడి రూపంలో రూ.109.90 కోట్ల మేర నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు.
ఒక్క రాత్రిలోనే 266 బస్సుల ధ్వంసం ఒక్క రాత్రిలోనే 266 బస్సుల ధ్వంసం Reviewed by AndhraDarshini on 01:29 Rating: 5

No comments:

Facebook