సమైక్యాంధ్ర పరిరక్షణకు ప్రజా చైతన్యం


ఎస్వీయూ క్యాంపస్‌ : సమైక్యాంధ్ర పరిరక్షణకు మేధావులు, విద్యార్థులు సంయుక్తంగా కృషిచేసి అన్ని రంగాల ప్రజల్ని చైతన్యం చేయాల్సిన ఆవశ్యకత వుందని పలువురు వక్తలు ఆభిప్రాయపడ్డారు. గురువారం ఎస్వీయూనివర్సిటీ ఆర్ట్స్‌ ఆడిటోరియంలో 'సమైక్యాంధ్రప్రదేశ్‌- ఆవశ్యకత' అనే అంశంపై చర్చాగోష్టిని ఎస్వీయూ అధ్యాపక సంఘం నిర్వహిం చింది. సమాజశాస్త్ర ఆచార్యు డి.వెంక టేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్య ఉపన్యాసకులుగా బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు ఐ. గురుస్వామి, కావలి డిగ్రీ కళాశాల అధ్యాపకుడు అన్నదాత మణి పాల్గొన్నారు.
ఎస్వీయూలోని వివిధ విభాగాల ప్రొఫెసర్లు సమైక్యాం ధ్రప్రదేశ్‌ ఆవశ్యకతతో ముడిపడివున్న వివిధ అంశాలపై వివరణాత్మక సందేశాలను వినిపించారు. గురుస్వామి మాట్లాడుతూ మొన్నటి దాకా జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం ద్వారా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు తమ మధ్య ఐక్యమత్యాన్ని, స మైక్య రాష్ట్రంపై వారికున్న ప్రగాడ ఆ కాంక్షను తెలియజేశారని పేర్కొన్నారు. అన్నదాత మణి మాట్లాడుతూ వివిధ రకాల ప్రాసలతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఐకమత్యాన్ని, సమైక్యాంధ్ర ఆవ శ్యకతను రసవత్తరంగా వివరించారు.
ఒఆర్‌ఐ ప్రొఫెసర్‌ ఎన్‌. కృష్ణారెడ్డి ఆంధ్రరాష్ట్ర అవతరణ- చారిత్రక నేపథ్యం అనే అంశంపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మూడువేల సంవత్సరాల చరిత్ర కలిగిఉందని, తెలుగువారి ఐకమత్యం సమైక్యాంధ్రప్రదేశ్‌లోనే ఉంటుం దని పేర్కొన్నారు. ఆసియా- ఫసిపిక్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ జయచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలు- వనరులు అనే అంశంపై మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలోనే భౌగోళికంగా తెలుగు భాష ఇమిడివుందని, అనేక రకాలైన వనరులు రాష్ట్రమంతటా విస్తృతంగా ఉన్నాయని ఈ వనరుల సద్వినియోగం సమైక్యాంధ్రప్రదేశ్‌లోనే వీలవుతుందని తెలి యజేశారు. చరిత్ర విభాగం ప్రొఫెసర్‌ క్రిష్ణమోహన్‌ ఆంధ్రప్రదేశ్‌-అభివృద్ధి అనే అంశంపై మాట్లాడుతూ వాస్తవా నికి గత 20 సంవత్సరాల్లో వ్యవసా యం, పారిశ్రామిక, ఉపాధి, విద్యరంగాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల కంటే తెలంగాణలోనే ఎక్కువ అభివృ ద్ధి జరిగిందని గణాంకాలతో సహా వివరించారు.
సోషియాలజీ విభాగం ప్రొ ఫెసర్‌ డి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆచారాలు- సంప్రదాయాలు - భాష- వేషం- సంస్కృతి ఆధారంగానే తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంలో నివసి స్తున్నారని, రాష్ట్రాన్ని ముక్కలు చేయడం తెలుగు తల్లిని ఖండించడమే అన్నారు. బయోకెమిస్ట్రీ అధ్యాపకుడు డా క్టర్‌ ఎం.బాలాజీ మాట్లాడుతూ తెలం గాణా వెనుకబాటుకు సంబంధించి తెలంగాణాలోని మేధావులు, విద్యావేత్త లు, కట్టుకథలు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి మానవా భివృద్ది సూచిక ప్రకారం రాయలసీమ, కోస్తా ప్రాంతంలోని కొన్ని జిల్లాలు గణనీయంగా వెనుకబడి వున్నాయని తెలియజేశారు. కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్‌ వై.వి.రామిరెడ్డి మాట్లాడుతూ నేడు రా ష్ట్రంలో 30 యూనివర్సిటీలు వుండగా 16 వర్సిటీలు తెలంగాణా ప్రాంతంలో నే వున్నాయన్నారు.
ఐఐటి, ఐబిఎం, ఐఐఎం, సెంట్రల్‌ యూనివర్సిటీ, ఐసి ఆర్‌ఐ, ఎస్‌ఎటీ, డీఆర్‌డీవో, ఎన్‌ఐఎస్‌, డీఆర్‌ఆర్‌ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణాలోనే ఉ న్నాయన్నారు. రాష్ట్ర విభజన జరిగితే విద్య, ఉపాధి అవకాశాల్లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంత విద్యార్థులు 50 సంవత్సరాలు వెనుకబడి పోతారని తెలి యజేశారు. స్వూటా కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌రెడ్డి వందన సమర్పణ చేశారు. గత 13 రోజులుగా శాంతియుతంగా, విజయవంతంగా సమైక్యాంధ్ర పరి రక్షణ ఉద్యమాన్ని నడిపించడానికి సహకరించిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పోలీసులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.
సమైక్యాంధ్ర పరిరక్షణకు ప్రజా చైతన్యం సమైక్యాంధ్ర పరిరక్షణకు ప్రజా చైతన్యం Reviewed by AndhraDarshini on 00:23 Rating: 5

No comments:

Facebook