సమైక్యాంధ్ర పరిరక్షణకోసం ఈనెల 11 నుంచి కొనసాగిన ఉద్యమం 23వ తేదీతో ముగిసింది. దాదాపు రెండు వారాల పాటు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డా యి. ఏనాడూ విద్యార్థులకు సెలవులు ప్రకటించని కార్పొరేట్ విద్యాసంస్థలు సైతం పదిరోజులకు పైగా కళాశాలలు మూసివేశాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల మాట చెప్పనవసరం లేదు. ప్రతిచోటా ఉద్యమకారులు విద్యార్థుల ను సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ ర్యాలీలు, మానవ హారాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 3వ తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయిచింది. అయి తే పాఠ్యాంశాల బోధన పూర్తి కాని పరిస్థితులను దృష్టిలో వుంచుకుని పరీక్షలు వాయిదావేసే అవకాశమున్న ట్లు సమాచారం.
నిజానికి జిల్లాలో ఇంటర్ విద్య కష్టాల్లో ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 122 జూనియర్ కళాశాలల్లో 55 మాత్రమే ప్రభుత్వ కళాశాలలు. వీటిలో 1050 పోస్టులకుగాను దాదా పు 450 లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.పోస్టులు భర్తీ చేయకపోవడంతో బోధన కుంటుపడింది. దీనికి తోడు సమైక్యాంధ్ర సమ్మె కారణంగా ఇంటర్ విద్య మరింత కష్టాల్లో కూరుకుపోయింది. ఇకపోతే మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహి ంచాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయిం చింది. జిల్లాలో ఈ ఏడాదే ఉపాధ్యా య బదిలీల ప్రక్రియ కారణంగా పాఠ శాల విద్య పూర్తిగా కుంటుపడింది. జూలై 14న ప్రారంభమైన ఉపాధ్యా యుల ప్రక్రియ ఆగస్టు 23వ తేదీ నాటికి ఓ కొలిక్కి వచ్చింది.
అయినా ఉపాధ్యాయులు సక్రమంగా విధుల్లో చేరలేదు. దీనికితోడు 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ కారణం గా చాలావరకు సమయం వృథా అయింది. ఉపాధ్యాయులు లేనికార ణంగా పాఠశాలల్లో విద్యాబోధన చాలా అధ్వానంగా తయారైంది. డిసెంబరు 31 నాటికి పదవతరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాల్సివుండగా చాలా పాఠశాలల్లో సగం సిలబస్ కూడా పూర్తికాలేదు. జిల్లాలో అర్ధ సంవత్సర పరీక్షలను కూడా ఓసారి వాయిదా వేశారు. మరోవైపు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి.
అర్ధసంవత్సర పరీక్షలు, సంక్రాంతి సెలవులు పూర్తయ్యేలోపు జనవరి మాసం దాదాపు గడిచిపోతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి మాత్రమే మధ్యలో మిగిలివుంటుంది. అతి తక్కువ సమయంలో ఉపాధ్యాయు లు సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేయడం కష్టం. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతు న్నారు. పాఠ్యాంశాలు పూర్తికాక, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో తెలియక విద్యార్థులు సతమతమవుతున్నారు.
చదవులపై'సమ్మె'ట పోటు!
Reviewed by AndhraDarshini
on
00:15
Rating:

No comments: