కొత్త సంవత్సర వేడుకల జోష్ తగ్గింది. గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనలు, రాజకీయ అనిశ్చితి ఈ వేడుకలపై స్పష్టంగా పడింది. ప్రతినెలా ఆఖరు పనిదినంలో వేతనాలిచ్చే సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఈ నెల ఇప్పటివరకూ వేతనాల ఊసేఎత్తడం లేదని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు బావురుమంటున్నారు. ఓ వైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, దానికితోడు పనుల్లేక అల్లాడుతున్న సామాన్యులు వెరసి ఈ ఏడాది డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకలకు దూరంగా ఉన్నారు. అదే సందర్భంలో న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణా వేర్పాటువాదులు ఇచ్చిన అల్టిమేటం ప్రభావం కూడా కన్పించింది. అనేక స్టార్ హోటళ్లు ప్రతిఏటా నిర్వహించే వేడుకలను ఈ ఏడాది రద్దుచేసుకున్నాయి. పోలీసులు ఎంత భరోసా ఇచ్చినా అనవసరంగా వివాదాలు ఎందుకనే కారణంతో వాటిని రద్దుచేసుకున్నట్లు తెలిపారు. కొన్ని చోట్ల మాత్రం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
పలు చౌరస్తాల్లో ప్రత్యేక తెలంగాణా వాదులు వేదికలు ఏర్పాటుచేసి తెలంగాణా ధూంధాం నిర్వహించారు. ఆట పాటలతో అలరించారు. మద్యం దుకాణాలు రాత్రి రెండు గంటలవరకు తెరిచి ఉంచారు. పబ్‌ల్లో హంగామా సృష్టించారు. ఐతే గత ఏడాది పోల్చితే ఈసారి వీటి జోష్ తక్కువైందని బేగంపేటలోని బాటిల్ అండ్ చిమ్నీ పబ్ నిర్వాహకులు తెలిపారు. దానికితోడు ఈ ఏడాది ప్రారంభమే చంద్రగ్రహణం రావడంతో మరికొందరు సాంప్రదాయవాదులు అశుభంగా పరిగణిస్తూ వేడుకలకు దూరంగా ఉన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తప్పతాగి ద్విచక్రవాహనాలపై వెళ్తున్న వారికి చలాన్లు విధించారు. మరికొందరి వాహనాలను సీజ్ చేశారు. ఎక్కువగా త్రిబుల్ రైడింగ్ కేసులే నమోదయ్యాయి. బేగంపేట ఫ్లైఓవర్ మినహా మిగిలిన ఫ్లైఓవర్‌ల పైకి వాహనదారులను అనుమతించలేదు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ ప్రాంతాల్లో రహదారుల్ని మూసివేశారు.
ఈ ఏడాది బేకరి కేకులకు డిమాండ్ పడిపోయింది. గతంలో మాదిరి బేకరిల వద్ద హంగు ఆర్భాటం కన్పించలేదు. ప్రత్యేక ఆఫర్లు లేవు. వ్యాపారం తక్కువగా ఉంటుందని ముందే ఊహించామని, ఐతే తాము ఊహించిన దానికన్నా మరీ ఘోరంగా అమ్మకాలు జరిగాయని రాంనగర్‌లోని టాప్‌టెన్ బేకరి యజమాని తెలిపారు. గ్రీటింగ్ కార్డులది కూడా అదే పరిస్థితి. సెల్‌ఫోన్‌లలో మెసేజ్‌లు పంపేందుకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప గ్రీటింగ్ కార్డులు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదని సికింద్రాబాద్‌లోని శ్రద్ధా కలెక్షన్స్ యజమాని తెలిపారు.

జోష్ తగ్గిన న్యూఇయర్ వేడుకలు
Reviewed by AndhraDarshini
on
11:45
Rating:

No comments: