పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌ల వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. వీటి నియంత్రణపై ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎక్కడా నిబంధనల ప్రకారం వీటి వినియోగం జరగట్లేదు. ప్రభుత్వం చేసిన చట్టం కాగితాలకే పరిమితమైంది. ఐతే అప్పుడప్పుడు వీటిని చట్టాన్ని గుర్తుచేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నామ్‌కేవాస్తేగా చిన్న వ్యాపారులపై కేసులు నమోదుచేస్తున్నారు. వీటిలో కూడా అధికారుల చేతివాటమే స్పష్టంగా కన్పిస్తోంది.
ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలను వదిలేసి వ్యాపారులపై కేసులు నమోదు చేస్తుండటంతో అధికారులకు వ్యాపారులకు మధ్య వాగ్వివాదాలు జరుగుతున్నాయి. ఉత్పత్తి పరిశ్రమలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారనే విషయం బహిరంగ రహస్యమే. గ్రేటర్ హైదరాబాద్‌లో పాలిథిన్ క్యారీబ్యాగుల వాడకాన్ని తగ్గిం చడంలో జిహెచ్‌ఎంసి పూర్తిగా విఫల మైంది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింది 20 మైక్రాన్‌ల కన్నా తక్కువున్న పాలిథిన్ క్యారీబ్యాగులు, పాలిథిన్ టీ, వాటర్ గ్లాసుల వాడ కాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం చట్టం చేసింది. దీన్ని పర్యవేక్షించేందుకు జిహెచ్‌ఎంసిలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారంలో రెండ్రోజులు పూర్తిగా పాలిథిన్ నివారణ చర్యలను చేపట్టాలని ఈ విభాగం నిర్ణయించింది.
ప్రారంభంలో అధికారులు నానా హంగామా సృష్టించారు. ఎన్‌ఫోర్స్ మెంట్ టీములను వెంటేసుకొని ప్రతి ప్లాస్టిక్ దుకాణాన్ని, వ్యాపార సంస్థలను తనిఖీలు చేశారు. నిబంధ నలు అతిక్రమిం చారంటూ అందరికీ నోటీసులు జారీ చేశారు. ఈ కోవలో పెద్దపెద్ద ఫైవ్‌స్టార్ హోటళ్లు కూడా ఉండటం గమనార్హం. 20 మైక్రాన్‌ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకునేవారు. పలువురికి భారీగా పెనాల్టీలు వేశార.ు కేసులు బుక్ చేశారు. దీంతో కొద్ది రోజులు ప్లాస్టిక్ వస్తువుల వాడకం తగ్గింది. పరిస్థితిలో మార్పు వస్తుందనుకుంటున్న తరుణంలో అధికారులు ప్లాస్టిక్ పరిశ్రమలతో మిలాఖత్ అయ్యి పట్టీ పట్టనట్లు వ్యవహరించారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నగరంలో రోజు రోజుకూ వీటి వాడకం పెరుగుతోంది. కొన్ని కంపెనీలు కవర్ల పైన 20 మైక్రాన్‌లని ముద్రించి లోపల నాశిరకం కవర్లను పెడుతున్నాయి. ఇవన్నీ అధికారులకు తెలియకుండా జరుగుతున్నాయంటే నమ్మశక్యం కాదు. గ్రేటర్ పరిధిలో దాదాపు 700 పాలిథిన్ తయారీ పరిశ్రమలున్నాయి.
78 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం కంపెనీల ఉత్పత్తులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవు. ప్రభుత్వ ఉత్తర్వులు వీరిని 'దోనెంబర్ దందా'కు ప్రోత్సహించేవిగా ఉన్నాయే తప్ప వాటిని నియంత్రించే దిశగా లేవని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. నిబంధనల అమలుపై అధికారులు చెప్తున్న సాకులు చిత్రంగా ఉంటున్నాయి. తాము గ్రేటర్ పరిధిలోని ప్లాస్టిక్ కంపెనీలను నియంత్రిస్తున్నామని, ఐతే ఇతర రాష్ట్రాల నుండి నాశిరకం ప్లాస్టిక్ ఉత్పత్తులు మార్కెట్లను ముంచెత్తుతున్నాయని చెప్తున్నారు. దాని కోసమే వ్యాపార కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నామని సమర్ధించుకుంటున్నారు.
పర్యావరణంపై ప్రభావం
ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌ల తయారీలో టాక్సిక్ రసాయనాలు వాడుతారు. ప్రొఫ్‌లైన్, పెనాల్, ఎథిలిన్, పాలిస్ట్రీన్, బెంజిన్ తదితర రసాయనాలు ప్రధానంగా వాడుతారు. వీటికి రీసైకిల్ ప్రభావం (కుళ్లిపోయే స్వభావం) ఉండదు. ఇవి పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తాయి. పూడ్చిస్తే భూమిపై ప్రభావం చూపుతాయి. పడేస్తే డ్రయినేజికి అడ్డుపడే అవకాశముంది. వర్షమొస్తే చెరువులు, నదుల్ల్లో చేరి జల కాలుష్యానికి దారితీస్తాయి. పాలిథిన్ కవర్లను కాలిస్తే విషవాయువులు వెలువడి వాయు కాలుష్యాన్ని సృష్టిస్తాయి. వీటిని పేపర్ తరహాలో మళ్లీ ఉపయోగించే అవకాశం లేదు. వీటి వాడకం వల్ల జల, వాయు, భూమి, అడవులు, తదితర సహజ వనరులపై ప్రభావం చూపి పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. ఇది మానవుని మనుగడకే ప్రమాదం. పాలు, నూనె, ఉప్పు తదితర ఆహార పదార్థాలను వీటిల్లో ప్యాక్ చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రబలుతాయి. వీటి వాడకం హానికరమని పర్యావరణ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.
పాతరోజులే బెటర్
గతంలో ప్రజలు గుడ్డ సంచులను వాడే వారు. వాటి స్థానంలో పాలిథిన్ కవర్లు అందుబాటులోకి వచ్చాయి. దీనికి కారణం వీటి తయారీకి పేపర్ కన్నా తక్కువగా ఖర్చవుతుంది. చౌకగా తయారవడంతో వీటిని మంచి వ్యాపారంగా వ్యాపారవేత్తలు మలచుకున్నారు. వారికి కావలసింది లాభాలు. ప్రజలు, పర్యావరణం ఏమైతేనేమన్నది వారి స్వభావం. ఇవి చాలా తేలిగ్గాను, పలుచగాను చూడ్డానికి రంగు రంగుల్లో మంచి మంచి డిజైన్లలో లభించడంతో ప్రజలు సైతం వీటి వాడకంపై మక్కువ పెంచుకున్నారు. ఆహార పదార్థాల మొదలు ప్రతి వస్తువు వీటిలోనే అమ్మడం, కొనడం జరుగుతోంది. ఇలా వీటి వాడకం పెరిగిపోయింది. దీంతో ప్రభుత్వం పర్యావరణ రక్షణ చట్టం చేసింది. అయినా చిన్న వ్యాపారుల మొదలు మల్టీనేషనల్ షాపింగ్ మాల్స్ వరకూ ఇవే వాడుతున్నారు. కావున తయారీనే ఆపడం పరిష్కారమౌతుంది. అవి మార్కెట్లో ఉన్ననాళ్లు చట్టం అమలు చేయడం కష్టమని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాధికారుల వైఫల్యం, అవినీతి దీన్ని రుజువు చేస్తున్నాయి.
పాలిథిన్ కవర్ల వాడకం అరికడదాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం
అధికారులు చట్టం అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించాలి. దాడులు విరివిగా చేసి పూర్తి వాడకాన్ని నియంత్రించాలి. ప్రతి వార్డులోనూ పర్యావరణంపై అవగాహన సదస్సులు, సైన్స్‌ఫెయిర్‌లు ఏర్పాటు చేయాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. సైన్‌బోర్డులు ఏర్పాటుచేసి సందేశాల రూపంలో ప్రచారం నిర్వహించాలి. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్, గండిపేట చెరువు. గోల్కొండ బావులు తదితర దర్శనీయ స్థలాల్లో మనం గమనిస్తూనే ఉంటాం ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు నీటిలో వేస్తుంటారు. ఇలాంటి దర్శనీయ స్థలాల్లో చెరువులు, కుంటలు, కాలువలు తదితర నీటి పరివాహక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు వేయకుండా నియంత్రించాలి. పంక్షన్లప్పుడు ప్లాస్టిక్ పేట్లు, గ్లాసులు వాడటం వ్యర్థపదార్థాలు గుట్టలు గుట్టలుగా వదిలేయడం కూడా మనం గమనిస్తాం. ఈ తరహా చర్యల్ని కూడా అదుపు చేయాలి. వాటి వాడకం వల్ల కలిగే దుష్పలితాలను విరివిగా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన పెంచాలి.
ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలను వదిలేసి వ్యాపారులపై కేసులు నమోదు చేస్తుండటంతో అధికారులకు వ్యాపారులకు మధ్య వాగ్వివాదాలు జరుగుతున్నాయి. ఉత్పత్తి పరిశ్రమలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారనే విషయం బహిరంగ రహస్యమే. గ్రేటర్ హైదరాబాద్‌లో పాలిథిన్ క్యారీబ్యాగుల వాడకాన్ని తగ్గిం చడంలో జిహెచ్‌ఎంసి పూర్తిగా విఫల మైంది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింది 20 మైక్రాన్‌ల కన్నా తక్కువున్న పాలిథిన్ క్యారీబ్యాగులు, పాలిథిన్ టీ, వాటర్ గ్లాసుల వాడ కాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం చట్టం చేసింది. దీన్ని పర్యవేక్షించేందుకు జిహెచ్‌ఎంసిలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారంలో రెండ్రోజులు పూర్తిగా పాలిథిన్ నివారణ చర్యలను చేపట్టాలని ఈ విభాగం నిర్ణయించింది.
78 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం కంపెనీల ఉత్పత్తులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవు. ప్రభుత్వ ఉత్తర్వులు వీరిని 'దోనెంబర్ దందా'కు ప్రోత్సహించేవిగా ఉన్నాయే తప్ప వాటిని నియంత్రించే దిశగా లేవని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. నిబంధనల అమలుపై అధికారులు చెప్తున్న సాకులు చిత్రంగా ఉంటున్నాయి. తాము గ్రేటర్ పరిధిలోని ప్లాస్టిక్ కంపెనీలను నియంత్రిస్తున్నామని, ఐతే ఇతర రాష్ట్రాల నుండి నాశిరకం ప్లాస్టిక్ ఉత్పత్తులు మార్కెట్లను ముంచెత్తుతున్నాయని చెప్తున్నారు. దాని కోసమే వ్యాపార కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నామని సమర్ధించుకుంటున్నారు.
పర్యావరణంపై ప్రభావం
పాతరోజులే బెటర్
గతంలో ప్రజలు గుడ్డ సంచులను వాడే వారు. వాటి స్థానంలో పాలిథిన్ కవర్లు అందుబాటులోకి వచ్చాయి. దీనికి కారణం వీటి తయారీకి పేపర్ కన్నా తక్కువగా ఖర్చవుతుంది. చౌకగా తయారవడంతో వీటిని మంచి వ్యాపారంగా వ్యాపారవేత్తలు మలచుకున్నారు. వారికి కావలసింది లాభాలు. ప్రజలు, పర్యావరణం ఏమైతేనేమన్నది వారి స్వభావం. ఇవి చాలా తేలిగ్గాను, పలుచగాను చూడ్డానికి రంగు రంగుల్లో మంచి మంచి డిజైన్లలో లభించడంతో ప్రజలు సైతం వీటి వాడకంపై మక్కువ పెంచుకున్నారు. ఆహార పదార్థాల మొదలు ప్రతి వస్తువు వీటిలోనే అమ్మడం, కొనడం జరుగుతోంది. ఇలా వీటి వాడకం పెరిగిపోయింది. దీంతో ప్రభుత్వం పర్యావరణ రక్షణ చట్టం చేసింది. అయినా చిన్న వ్యాపారుల మొదలు మల్టీనేషనల్ షాపింగ్ మాల్స్ వరకూ ఇవే వాడుతున్నారు. కావున తయారీనే ఆపడం పరిష్కారమౌతుంది. అవి మార్కెట్లో ఉన్ననాళ్లు చట్టం అమలు చేయడం కష్టమని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాధికారుల వైఫల్యం, అవినీతి దీన్ని రుజువు చేస్తున్నాయి.
పాలిథిన్ కవర్ల వాడకం అరికడదాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం
అధికారులు చట్టం అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించాలి. దాడులు విరివిగా చేసి పూర్తి వాడకాన్ని నియంత్రించాలి. ప్రతి వార్డులోనూ పర్యావరణంపై అవగాహన సదస్సులు, సైన్స్‌ఫెయిర్‌లు ఏర్పాటు చేయాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. సైన్‌బోర్డులు ఏర్పాటుచేసి సందేశాల రూపంలో ప్రచారం నిర్వహించాలి. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్, గండిపేట చెరువు. గోల్కొండ బావులు తదితర దర్శనీయ స్థలాల్లో మనం గమనిస్తూనే ఉంటాం ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు నీటిలో వేస్తుంటారు. ఇలాంటి దర్శనీయ స్థలాల్లో చెరువులు, కుంటలు, కాలువలు తదితర నీటి పరివాహక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు వేయకుండా నియంత్రించాలి. పంక్షన్లప్పుడు ప్లాస్టిక్ పేట్లు, గ్లాసులు వాడటం వ్యర్థపదార్థాలు గుట్టలు గుట్టలుగా వదిలేయడం కూడా మనం గమనిస్తాం. ఈ తరహా చర్యల్ని కూడా అదుపు చేయాలి. వాటి వాడకం వల్ల కలిగే దుష్పలితాలను విరివిగా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన పెంచాలి.
విచ్చల విడిగా ప్లాస్టిక్ వాడకం : పర్యావణానికి పొంచి ఉన్న ముప్పు
Reviewed by AndhraDarshini
on
11:50
Rating:

No comments: