ఆకలి కేకలతో ప్రపంచం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టింది. తగినంత ఆహారం లేక కాలే కడుపులతో ఉన్నవారు ఇప్పటికే వంద కోట్లు దాటారు. కాగా 2009, నవంబర్‌లో జరిగిన ఆహార భద్రతపై ఐరాస ప్రపంచ శిఖరాగ్ర సభ ఆకలిని తొలగించే విధంగా చారిత్రకమైన మార్పులను తెస్తుందనే ఆశలను వమ్ము చేసింది. ఆహార, వ్యవసాయ సంస్థ హెడ్‌క్వార్టర్ రోమ్‌లో జరిగిన సమావేశంలో శక్తిమంతమైన దేశాల నేతలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఆకలిపై పోరుకు కట్టుబడి ఉండే పద్ధతిలో నిధులు సమకూర్చడంలోనూ, దాన్ని పూర్తిగా నిరోధించే స్పష్టమైన తేదీని నిర్ణయించడంలోనూ విఫలమయ్యారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2007-08 నుంచి ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడం, దానికి తోడు ఆర్థిక సంక్షోభం ప్రపంచ అన్నార్తుల సంఖ్యను పెంచిందని, వారి సంఖ్య 102 కోట్లకు చేరిందని నిపుణులు చెప్పారు. ఇప్పటికీ ధరలు చుక్కల్లోనే ఉన్నాయన్నారు.
డిసెంబర్‌లో కోపెన్‌హాగెన్‌లో వాతావరణ మార్పుపై జరిగిన సదస్సు కూడా విఫలం కావడంతో ప్రపంచలోని అనేక ప్రాంతాల్లో ఆహార భద్రతకు ప్రమాదం మరింతగా పెరిగింది. 'మీరు గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలన్నింటినీ పరిశీలిస్తే ఆహార భద్రతకు ప్రమాదం ప్రాథమిక స్థాయిలోనే ప్రారంభమవుతుందని అర్థమవుతోంది' అని ఇర్త్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధనా విభాగం డైరెక్టర్ జానెట్ లార్సెన్ ఐపిఎస్ వార్తా సంస్థకు తెలిపారు. 'ప్రాథమిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటల దిగుబడి ప్రభావితమవుతుంది. వేడి బాగా పెరిగితే పంటలు పూర్తిగా దెబ్బతింటాయి. అది నీటి వనరులను ప్రభావితం చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా నీళ్ళుంటాయి. కొన్ని చోట్ల అతి స్వల్పంగా ఉంటాయి. ఇప్పటికే మన జల వనరులపై ఒత్తిడి ప్రారంభమైంది' అని అన్నారు. 'ఉదాహరణకు సముద్ర నీటి మట్టం ఒక్క మీటరు పెరిగితే బంగ్లాదేశ్‌లో వరి పండే భూమిలో చాలా భాగం వరద బారిన పడుతుంది.
వాతావరణ మార్పుల వల్ల లక్షలాది మంది తమ ఆవాసాలు కోల్పోయి ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు' అని చెప్పారు. వీటన్నింటినీ బట్టి చూస్తే 2010లో ఆకలితో అలమటించే వారి సంఖ్య తగ్గుతుందని ఆశించగలమా? అయితే ఎఫ్‌ఎఓ మాత్రం ఈ పరిస్థితి ఉండదంటోంది. వచ్చే ఆరు నెలల్లో మంచి ఉత్పత్తి వచ్చి నిల్వలు పెరిగే పరిస్థితి కనిపిస్తోందని ఆ సంస్థకు చెందిన హాఫెజ్ ఘానెమ్ చెప్పారు. సరైన విధానాల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆహార భద్రతలో పురోగతిని సాధించే అవకాశముందని అన్నారు.ప్రపంచ పేద జనాభాల్లో మూడింట రెండు వంతుల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, వారంతా ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడుతున్నారని అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఎఫ్‌ఎడి) పేర్కొంది.వారికి సరైన సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాలు, వాతావరణ మార్పులను తట్టుకొనే పరిజ్ఞానం అందిస్తే ఉత్పత్తిని పెంచగలరని తెలిపింది.

ఆకలి కేకలతో నూతన సంవత్సరంలోకి
Reviewed by AndhraDarshini
on
14:40
Rating:

No comments: