శ్వేతపత్రం సిద్ధం చేయాలని విన్నపం
గౌరవనీయులైన శ్రీ రోశయ్య గారికి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయమై అధికారిక చర్చలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మీకు లేఖ వ్రాస్తున్నాను. చర్చల పర్యవసానంగా ఏమి జరుగుతుంది... అనే విషయం కన్నా, ఈ పరిస్థితులు ఉత్పన్నం కావటానికి ప్రధాన కారణంగా ఆరోపించబడుతున్న 'దోపిడీ' విషయమై ఇప్పటికైనా తగు వివరణ ఇవ్వలేకపోతే.. శాశ్వతంగా కోస్తా జిల్లాల ప్రజలు చరిత్రలో దోపిడీ దొంగలుగా మిగిలిపోతారన్న ఆవేదనతోనే మీకు లేఖ వ్రాస్తున్నాను.
అన్ని రంగాలలోనూ తెలంగాణ బాగా వెనకబడిపోయిందనీ.. ఇందుకు ప్రధాన కారణం, కోస్తావారి దోపిడీ విధానమేనని గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వాలు వ్యవహరించటంవల్లనే ఈ వాతావరణం ఏర్పడిందని నా నమ్మకం.
మొదటి ఎస్సార్సీ(ఫజల్ అలీ కమిషన్) ఆంధ్ర- తెలంగాణల విలీనాన్ని వ్యతిరేకించిందనీ.. అయినా బలవంతంగా ఈ రెండు ప్రాంతాలనూ.. కోస్తా ప్రాంతపు వారి పలుకుబడితో, కుయుక్తులతో కలిపి వేశారనీ ఒక అభియోగం.. 1956 నుండీ ప్రచారం చేయబడుతూనే ఉంది. నిజానికి 369 నుండి 389 పేరాల వరకూ, స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చదివితే, ఆంధ్ర తెలంగాణల విలీనంవల్ల ఒనగూరే ప్రయోజనాల గురించి ఉందిగానీ, ఎక్కడా ఒక్కవాక్యం విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ లేనేలేదు!
తెలంగాణ ప్రాంత ప్రజలలోనున్న అప్రెహెన్షన్స్, అపోహలు అంటూ కమిషన్‌లో ప్రస్తావించిన అంశాల ను, కమిషన్ అభిప్రాయాలుగా ఉటంకిస్తూ వచ్చారు.
ఫజల్ అలీ కమిషన్ నివేదిక సిఫార్సులను అతిక్రమించి జరిగిన విషయం ఒక్కటే! 1962 అసెంబ్లీ, పార్లమెంట్ జనరల్ ఎన్నికల అనంతరం, కొత్తగా ఏర్పడిన హైదరాబాద్ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీతో విశాలాంధ్ర విలీనాన్ని తీర్మానం చేయించి ఆ తర్వాత ఒకే రాష్ట్రంగా కలిపితే బావుంటుందన్న ఫజల్ అలీ కమిషన్ సిఫార్సును మాత్రం అమలు చేయలేదు. ఇందుకు కారణం... అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కమిటీ రిపోర్టు వచ్చిన వెంటనే, ఆ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభింప చేయడం, 147 మంది సభ్యులు చర్చలో పాల్గొనగా 103 మంది విశాలాంధ్రకు అనుకూలంగానూ 29 మంది వ్యతిరేకంగానూ 15 మంది తటస్థం గానూ అభిప్రాయపడటం, మూడింట రెండొంతుల మెజార్టీతో అప్పుడే విలీనాన్ని పూర్తి చేయించడం జరిగింది. ఈ ప్రక్రియలో కోస్తావాసుల ప్రమేయం ఏమిటో, దీని వెనుక కుట్ర జరిగిందన్న ఆరోపణలో వాస్తవమెంతో లోకానికి తెలియ చెప్పవలసిన బాధ్యత విస్మరించలేం.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో చేసుకున్న ఒప్పందాలుగానీ 1969 ఉద్యమం, 1973 ఉద్యమాల అనంతరం అంగీకరించిన అగ్రిమెంట్లుగానీ ఏనాడూ అమలు చెయ్యలేదనీ, ఇది కూడా కోస్తా నాయకులు తెలంగాణకు చేసిన ద్రోహమనీ పదేపదే చెప్తూ వస్తున్నారు. ఇదొక విడ్డూరమైన ఆరోపణ! ఎప్పుడైనా తెలంగాణ ప్రాతినిథ్యం లేకుండా రాష్ట్ర కేబినెట్ ఏర్పడిందా? ఎన్నిసార్లు తెలంగాణకు చెందిన కేబినెట్ మంత్రులు ఒప్పంద ఉల్లంఘనపై కేబినెట్‌లో చర్చించారు? ఒప్పంద ఉల్లంఘనలో కోస్తా ప్రాంతపు మంత్రులదేనా బాధ్యత? తెలంగాణ మంత్రులు ఒప్పంద షరతులను సక్రమంగా అమలు చేయించుకోనక్కరలేదా!? ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన అసెంబ్లీ చర్చలో భాగాన్ని మీ దృష్టికి తెస్తున్నాను.
"ఉద్యోగులకు సంబంధించి ఆరు సూత్రాల పథకం, జోనల్ సిస్టం వంటివి దెబ్బతీస్తున్నాయి. సర్‌ప్లస్ స్టాఫ్‌ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునే వీలుండాలి. కాని ఆ విధానం లేదు. మనకు మనం విధించుకున్న ఆటంకం ఆరు సూత్రాల జోనల్ విధానం. సిబ్బందిని వినియోగించుకోలేక, పని లేకపోయినా కోట్ల, లక్షల రూపాయలు నిరర్ధకంగా ఖర్చు చేస్తూ వృ«థా చేస్తున్నాం. ఈ విధానంలో మార్పులు చేయాలి. డైనమిక్‌గా మూవ్ కావాలి. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతోనూ ఉద్యోగ సంఘాలతోనూ సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి'. 18.7.1996న రాష్ట్ర శాసనసభలో కె.చంద్రశేఖరరావు గారు చేసిన ప్రసంగంలో భాగమిది. ఇదే ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి సాహసోపేత నిర్ణయాలను కేసీఆర్ గారు కీర్తిస్తూ మాట్లాడిన మాటలు... ఇక్కడ అప్రస్తుతం కాబట్టి ఉదహరించలేదు.
సాక్షాత్తూ కేసీఆర్ గారే ఆరు సూత్రాల పథకాన్నీ జోనల్ విధానాన్నీ ఆటంకంగా భావించిన విషయం పక్కనపెట్టి, ఈ విధానాలకు కోస్తా నాయకత్వం తూట్లు పొడిచిందని ఆరోపించటం ఎంతవరకు సమంజసమో చరిత్రే నిర్ణయిస్తుంది.
కోస్తా ప్రాంతం వారి దోపిడీ విధానం కారణంగా తెలంగాణ అభివృద్ధి కుంటుపడిందన్న వాదన విషయమై ప్రభుత్వ శాఖల నుంచి నేను సేకరించిన కొన్ని వివరాలు మీ ముందుంచుతున్నాను. వీటిని పరిశీలిస్తే తెలంగాణ ప్రాంతం మిగిలిన ఆంధ్రప్రదేశ్ కంటే అభివృద్ధిలో అగ్రగామిగానే ఉందని అర్థమవుతుంది.
ఇరిగేషన్ విషయంలో కూడా తెలంగాణ ప్రాంతమంతా 900 నుంచి 1,400 అడుగుల వరకు సముద్ర తీరమట్టంకన్నా ఎత్తులో ఉందన్న విషయాన్ని పక్కకుపెట్టి జలదోపిడీ అంటూ నిరంతరమూ కోస్తా ప్రాంత ప్రజలమీద నిందమోపుతూనే ఉంటారు.
1956లో 41.80 లక్షల ఎకరాలకు సాగునీరు లభ్యమయ్యే కోస్తా ప్రాంతంలో 2004 నాటికి మరో 28.16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఏర్పాట్లు జరిగాయనీ... (మొత్తం 69.98) 1956లో 17.51 లక్షల ఎకరాల సాగునీరు తెలంగాణ ప్రాంతంలో లభ్యమవుతుండగా 2004 నాటికి మరో 27.78 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఏర్పాట్లు జరిగాయనీ... (మొత్తం.. 45.29) 1956లో 9.07 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరందే రాయలసీమ ప్రాంతంలో 2004 నాటికి మరో 7.16 లక్షల ఎకరాలకు నీరందించే ఏర్పాట్లు జరిగాయనీ (మొత్తం 16.23) ఇరిగేషన్ లెక్కలు చెప్తున్నాయి. తెలంగాణలో 158.65 శాతం, కోస్తాలో 67.46 శాతం, రాయలసీమలో 78.49 శాతం ఇరిగేషన్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. (1956-2004 మధ్య).
ట్యాక్స్ రెవెన్యూ కలెక్షన్ల వివరాలలోకి వెళ్తే, కోస్తా మొత్తంలో 2,676.85 కోట్లు, తెలంగాణలో 1,175.01 కోట్లు, రాయలసీమలో 651.23 కోట్లు ఉండగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే 6,382.34 కోట్ల ఆదాయం ఉంది. హైదరాబాద్ మినహాయించి మిగతా రాష్ట్ర ఆదాయం 4,503.09 కోట్లు. (ఈ లెక్కలు పెట్రోలి యం, ఆల్కహాలు ఉత్పత్తుల ట్యాక్స్ మినహాయించి).
జేవీ నర్సింగరావు, సిద్ధారెడ్డి, పి.నరసారెడ్డి, జి.వి.సుధాకరరావు, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, పొన్నాల లకయ్య... ఇరిగేషన్ మంత్రులందరూ తెలంగాణ ప్రాంతానికి చెందినవారే అయినప్పటికీ కోస్తా ప్రాంతం జలదోపిడీ చేస్తోందని ఆరోపించటమే విచిత్రం (కోడెల, కేఈ కృష్ణమూర్తి, వాసిరెడ్డి, చనుమోలు మాత్రమే తెలంగాణేతర ఇరిగేషన్ మంత్రులని గుర్తు) ఈ ఇరిగేషన్(మేజర్) మంత్రులలో ఎవరైనా, ఎప్పుడైనా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేబినెట్‌లోగాని, బైటగాని ఆరోపించివుంటే, ఈ వివరాలు కూడా తెలియజేయాల్సిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి చర్చలు ప్రారంభించబడుతున్న ఈ సమయంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటివరకూ ఏయే జిల్లాల్లో ఎంతెంత ఖర్చు చేయబడిందో, ఏయే పనులు చేపట్టబడ్డాయో సవివరంగా ఒక 'శ్వేతపత్రం' విడుదల చేయవల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.
అభివృద్ధి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలో నిజానిజాలు తేటతెల్లం కాకపోతే... తెలంగాణ, తెలంగాణేతర ప్రజల మధ్య ఒక శాశ్వత అగాధం ఏర్పడిపోయే ప్రమాదముందనీ, దీనివల్ల తెలుగుభాష మాట్లాడే ఒకే ప్రాంత ప్రజలు భవిష్యత్‌లో శత్రువులుగా బతకవలసిన దుస్థితి ఏర్పడుతుందేమోనని... నా ఆవేదన!
యథార్థాలని బైటపెట్టడం ద్వారా, ఆనాడు ఫజల్ అలీ కమిషన్ చెప్పిన అప్రెహెన్షన్స్, అపోహలు ఏవైతే తెలంగాణ ప్రాంత ప్రజలలో నాటుకున్నాయో వాటిని తొలగించే ప్రయత్నం ఇప్పటికైనా చేపట్టాలని, శ్వేతపత్రం విడుదల మాత్రమే అందుకు దోహదపడగలదని... నా విజ్ఞప్తి. రాష్ట్ర విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా, ఎంత తొందరగా వీలైతే అంతతొందరగా శ్వేతపత్రం విషయమై తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

భవదీయుడు
ఉండవల్లి అరుణ్‌కుమార్
(02-01-2010)
(రాష్ట్ర విభజన అంశంపై ఢిల్లీలో ఈ నెల 5న రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ప్రతినిధులతో కేంద్ర హోంమంత్రి చిదంబరం సంప్రదింపులు జరపనున్న సందర్భంగా... ప్రత్యేక తెలంగాణ / సమైక్యాంధ్ర వివాదంపై రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్యకు రాసిన బహిరంగ లేఖ పూర్తిపాఠం)
ఉండవల్లి అరుణ్‌కుమార్
(02-01-2010)
'తెలంగాణ'పై ముఖ్యమంత్రి రోశయ్యకు ఉండవల్లి లేఖ
Reviewed by AndhraDarshini
on
14:07
Rating:
Reviewed by AndhraDarshini
on
14:07
Rating:

No comments: