ఉపాద్యాయ వృత్తిని వదిలి, కష్టజీవుల రాజ్యం కోసం జరిగిన పోరాటంలో దుమికి, ఉద్యమ సారథిగా ఉరికంబాన్ని ఎక్కేందుకు సైతం సిద్దమయిన వీరయోధుడాయన. విద్యార్థు లకు విద్యాబుద్దులు చెప్పాల్సిన బడి పంతులు బాధ్యత కంటే... సమాజాన్ని పట్టిపీడిస్తున్న దోపిడిని అంతమొందించే కర్తవ్య నిర్వహణే ఉత్తమనుకున్న విప్లవకారుడాయన. ఫాసిస్టు హిట్లర్ అమానుషాలపై సోవియట్ రష్యా సాధించిన విజయం ఆయనకు ప్రేరణనిచ్చింది. 'అమ్మ' నవల, ఉద్యమ పత్రికల పఠనం ఆయన ఆలోచనలను మార్చింది. ధనిక రైతు కుటుం బంలో పుట్టినా చుట్టుపక్కల కనిపిస్తున్న పేదల దుస్థితికి కారణాలు ఏమిటని అన్వేషించే క్రమం లో దొరలు, భూస్వాములు సాగించే పెత్తనా లనూ, ఆగడాలను ప్రశ్నించడం ఆరంభించారు.
విద్యార్థి దశలోనే సామాజిక ఉద్యమాల వైపు ఆకర్షితులయి, చదువుతో పాటు సమాజ స్థితి గతుల్ని పరిశీలించి కమ్యూనిస్టుగా మారాడు. వీరతెలంగాణా సాయుధపోరాటంలో ముఖ్య మైన భూమిక నిర్వహించాడు. మార్క్సిజం- లెనినిజం సిద్ధాంతాన్ని ఆకళింపుజేసుకుని జీవిత చరమాంకం వరకు మార్క్సిస్టు పార్టీ కార్యకర్తగా కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశాడు. ఆయనే గత నెల 27న నల్గొండజిల్లా సూర్యాపేటలో శాశ్వతంగా కనుమూసిన చల్లా సీతారాం రెడ్డి. 91 ఏళ్ల సీతారాం రెడ్డి కమ్యూనిస్టు ఉద్యమం పట్ల అంకిత భావానికీ, ఉక్కు శిక్షణకూ మారు పేరుగా నిలిచారు. చివరి వరకు కమ్యూనిస్టు ప్రమాణాలకు ప్రాణమిస్తు బతికారు. నవంబర్ 27 న ఆయన స్వగ్రామమైన వేములపల్లి మండలం రావుల పెంటలో అశ్రునయనాల మధ్య చల్లా అంత్రక్రియలు జరిగాయి.
ఉవ్వెత్తున లేచిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంతో స్ఫూర్తి పొందిన చల్లా సీతారాంరెడ్డి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలోకి వచ్చారు. మిర్యాలగూడం తాలూకా రావులపెంట గ్రామంలో ధనిక రైతు కుటుంబానికి చెందిన చల్లా అప్పారెడ్డి, అచ్చమ్మ దంపతులకు జన్మించిన ఎనిమిది మంది సంతానంలో సీతారాంరెడ్డి మూడవ వారు. 1918వ సంవత్సరం మే నెలలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మేనమామ ఊరైన రేపాల గ్రామం (మునగాల మండలం)లో పూర్తిచేశారు.
అనంతరం స్వగ్రామమైన రావుల పెంటలో ఉంటూ దగ్గరల్లోని ఆగామోత్కూర్‌లో ఐదో తరగతి ఉర్దూమీడియంలో చదివారు. ఏడో తరగతి వరకు సూర్యాపేటలో పదో తరగతిని నల్గొండలో పూర్తిచేశారు. నల్గొండ పాఠశాలలో ఉన్నపుడే ఒకసారి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్నందున చల్లాతో పాటు ముగ్గురు విద్యార్థుల్ని స్కూల్ నుంచి తొలగించాలని హెడ్‌మాస్టర్ ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ పాఠశాలలో ఆ నలుగురే ప్రతిభావంతులుగా ఉన్నందున ఉన్నతాధి కారులు కొనసాగించాలి చెప్పారు. 1936లో మొట్టమొదటి సారి 'అమ్మ' నవల, కమ్యూనిస్టు మ్యానిఫెస్టో చదివారు. అలా కమ్యూనిస్టు భావజాలాన్ని పునికిపుచ్చుకున్న చల్లా అప్పట్లో ప్రచురితమయ్యే ఉర్దూ పత్రికలు చదివేవారు.
ఉన్నత మార్కులతో చదివిన చల్లాకు 1939లో ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లి గ్రామం లో చేరారు. అనంతరం మిర్యాలగూడకు బదిలీ అయ్యారు. 1946 వరకు ఉద్యోగంలో కొన సాగారు. ఉపాధ్యాయుడుగా ఉన్నపుడే కొంత మంది కామ్రెడ్స్‌తో పరిచయాలు ఏర్పడడం, తరచూ కలవడం వల్ల ఉద్యమం వైపు ఆకర్షితు లయ్యారు. అప్పటికే కౌమీజంగ్, న్యూయేజ్ అనే ఉద్యమ పత్రికలు చదవేవారు. దీంతో పోలీ సులు చల్లాను విచారించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తన వద్ద ఉన్న కమ్యూనిస్టు సాహిత్యాన్నీ, ఉద్యమ పత్రికల్నీ తన సొంత గ్రామంలోని ఇంట్లోకి చేరవేశారు. ఉపాధ్యా యునిగా ఉన్నపుడే దేవులపల్లి వెంకటేశ్వర రావుతో పరిచడం ఏర్పడడం వల్ల 1942లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత 1944లో విజయవాడలో జరిగిన రైతు మహా సభలకు చల్లాను పార్టీ పంపింది. ఉపాధ్యా యునిగా ఉంటూ కమ్యూనిస్టులతో సంబంధాలు కల్గి ఉండడంతో పోలీసుల వత్తిళ్లు పెరిగాయి.
ఒక రోజు చల్లా తండ్రి సంవత్సరీకానికి తన చెల్లెళ్లను తీసుకురావడానికి తడకమళ్లకు వెళ్లారు. మార్గమధ్యలో కమ్యూనిస్టు నాయకులు ధర్మబిక్షం, రాఘవేంధ్రరావులు కలిశారు. 'ఉద్యమం ముంచుకొస్తుంటే...ఊడూగుడి' లేదు ఏమీ లేదంటూ అడ్డుకున్నారు. దీంతో చల్లా చెల్లెళ్ల వెంట వెళ్లకుండా నాయకుల వెంట వెళ్లారు. అక్కడి నుంచి ఆయన అజ్ఞాతవాస జీవితం ఆరంభమైంది. అజ్ఞాతంలో ఉంటూ మునగాల ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తాతపర్తి వెంకటేశ్వరావు అనే పార్టీ ఆర్గనైజర్‌ను కలిశారు. నడిగూడం మండలంలోని రామాపురానికి గెరిల్లా శిక్షణ కోసం వెళ్లాడు. అక్కడకి డి.వి, భీమిరెడ్డి నర్సింహ్మరెడ్డి, దొడ్డా నర్సయ్య, మద్దికాయల ఓంకార్ వచ్చారు. శిక్షణ అనం తరం చల్లాను ఆర్గనైజర్‌గా నియమించారు.
మిర్యాలగూడ తాలూకాలోని అడవిదేవులపల్లి, కన్నెకల్లు, రాజారం, కొపంల్లి, వెంగన్నగూడం, వెంపాడు తదితర గ్రామాల్లో ఉద్యమాన్ని విస్తరింపచేశారు. ఒక రోజు 30,40 మంది దళంతో రాజవరం దొర వల్లభరెడ్డి భూములను పంచారు. 24 బస్తాల విత్తనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉప్పుదొరకని రోజుల్లో యలమంద నేతృత్వంలో వెంగన్నగూడం దొర రామానుజంరెడ్డిని పట్టుకుని ఉప్పు నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. దానికి చల్లా కీలక పాత్ర పోషించారు. ఇంటింకి తవ్వెడు ఉప్పును పంచారు. పోలీసు యాక్షన్ ప్రారంభమైన సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సి వచ్చింది. చల్లా దళం కోసం పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు. నాలుగు నెలల పాటు రాజవరం ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ఒక సారి పోలీలు దాడి చేయడంతో స్టెన్‌గన్ ఎక్కుపెట్టిన చల్లా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు.
దళంలోని సభ్యులు చెల్లాచెదు రయ్యారు. కంబాలపల్లిలో కొన్ని రోజులు తలదాచుకున్న చల్లా సీతారాంరెడ్డి అరిబండి లక్ష్మినారాయణతో కలిసి కృష్ణానది అవతలి వడ్డున ఉన్న తాళపల్లికి చేరుకున్నారు. రెండు నెలల పాటు అక్కడ ఉండి తిరిగి కృష్ణా ఒడ్డుకుకు వచ్చి లంబాడీ తండాల్లో తలదాచుకున్నారు. 1950లో డిండి అవతల నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఒక లోయలో తలదాచుకున్న సమయంలో మిలట్రీ, పోలీసు బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఒక రోజు పై నుంచి విమానం వారికోసం గాలిస్తూ... పలుమార్లు చక్కర్లు కొట్టింది. మరో వైపు కింద నుంచి పోలీసులు గస్తీ తిరుగుతుండేవారు. దరిదాపుల్లోనే పోలీసులు ఉన్నాడని ఒక దళ సభ్యులు చెప్పడంతో చల్లా బృందం అక్కడ వంటలు కూడా చేసుకోకుండా రోజులు గడిపారు. వంటలు చేస్తే వచ్చే పొగ ద్వారా పసిగడతారనే భయంతో ఉపవాసమున్నారు. ఆ తర్వాత విజయవాడలో రైతు మహాసభలో 1951లో పుచ్చలపల్లి సుందరయ్యను చూశారు చల్లా.
అంతకు ముందే నల్లమల్ల అడవిలో ఉన్నపుడు నాగేశ్వర్‌రావు పేరుతో వచ్చి సుందరయ్య చల్లా తదితర దళ సభుల్ని కలిశారు. ఆనాడు కనీసం తిండి గింజలు దొరకని పరిస్థితి ఉండేది. ఒక రోజు ఎట్లాగో అట్లాగ చల్లా ఒక బస్తా గింజలు సంపాదించ గలిగారు. దీంతో సుందరయ్య చల్లాను హత్తుకుని ప్రశంసించారు. అపుడు జరిగిన సమావేశంలో సుందరయ్య మాట్లాడుతూ 'రష్యా వెళ్లి స్టాలిన్‌ను కలిసిన విషయం గురించి చెప్పారు. పోరాటాన్ని విరరమించాలని పార్టీ నిర్ణయించినట్లు' చెప్పారు.
పోరాట విరమణ తర్వాత చల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చేరుకున్నారు. పోరాట సమయంలో మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్న ముస్లిం సిఐ ప్రతి సంఘటనలోనూ చల్లా పేరును కేసులో ఇరిక్కించేవాడు. ఒక గిరిజనుడు ఇచ్చిన సమాచారం మేరకు చల్లాను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ రహస్యాలను రాబట్టేందుకు పోలీసులు చల్లాను రాత్రంతా విచారించినా ఫలితం లేకపోయింది. చల్లా ఒక్క విషయం కూడా బయటకు పొక్కలేదు. అనంతరం మిర్యాలగూడ జైళుకు చల్లాను తరలించారు. అ సమయంలోనే సుందరయ్య గా చల్లాను కలిశారు.
వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన ఒక భూస్వామి నిద్రిస్తున్న పుడు అతని ముఖంపై ఉన్న బట్టను తొలగించగా దాన్ని సాకుగా చేసుకొని చల్లా సీతారాంరెడ్డిపై హత్య కేసును నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు ఉరిశిక్ష విధించారు.
మిర్యాలగూడ కోర్టులో అబ్దుల్ ఘనీ, వెంకటరామారావులు ఎస్‌ఆర్ తరపున వాదించారు. సెషన్ కోర్టులో ఈ కేసును కట్టా రాంరెడ్డి, చిన వెంకట రామారావులు వాదించారు. ఉరిశిక్షపై హైకోర్టులో అప్పీల్ చేయగా మనోహర్‌రాజ్ సక్సేనాను హైకోర్టులాయర్‌గా నియమించు కున్నారు. మూడు రోజుల పాటు వాదనలు జరిగాయి. చివరికి ఉరిశిక్షను రద్దు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
పోరాటం అనంతరం కమ్యూనిస్టు పార్టీలో చేరిన సీతారాంరెడ్డి 1954లో మిర్యాలగూడ తాలూకా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా, 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక అనంతరం సిపిఎం పక్షాన నిలిచారు. జిల్లా కమిటీ సభ్యునిగా, కార్యదర్శివర్గ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. 1954 నుండి 1974 వరకు రావులపెంట గ్రామ సర్పంచ్‌గా పని చేశారు.
1959లో మొదటిసారిగా మిర్యాలగూడ సమితి ప్రెసి డెంట్‌గా ఎన్నికయ్యారు. 1957లో ఎంఎల్‌ఏగా పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే డబ్బుల్లేవని పోటీ చేయలేదు. ఆ సమయంలో పిడిఎఫ్ నుండి పోటీ చేసిన సి. వెంకట్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. 1967లో మిర్యాలగూడ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు.

- మేకల కృష్ణయ్య
ఉద్యమమే ఊపిరిగా బ్రతికిన వీరయోధుడు చల్లా సీతారాంరెడ్డి
Reviewed by AndhraDarshini
on
13:44
Rating:

No comments: